* స్కూలుకు తాళం వేసి తల్లిదండ్రుల నిరసన
* వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్
ఆకేరు న్యూస్, గద్వాల : ఉపాధ్యాయులు లేక తమ పిల్లలకు సరైన విద్యనందడం లేదని తల్లిదండ్రులు రోడ్డెక్కారు. పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లా ఆరగిద్ద ప్రాథమిక పాఠశాలలో 306 మంది విద్యార్థులకు గాను ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేశారు. దసరా సెలవుల తర్వాత వలంటీర్ల నియమిస్తామని ఎంఈఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
