* నిందితుడు పాకిస్తానీ
ఆకేరు న్యూస్, డెస్క్ : దుబాయ్(Dubai)లో చోటుచేసుకున్న దారుణంతో తెలంగాణ విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రానికి చెందిన ఇద్దరిని దారుణంగా నరికి చంపారు. మృతుల్లో ఒవరు నిర్మల్ (Nirmal) జిల్లా వాసి సాగర్. ఆరేళ్ల క్రితం ఉపాధి కోసం సాగర్ (30) దుబాయ్ వెళ్లారు. అక్కడి ఓ బేకరీలో పని చేస్తున్నారు. సాగర్ మృతిపై సోన్ గ్రామంలోని కుటుంబీకులకు సమాచారం అందించారు. గ్రూప్ తగాదాల్లో సాగర్ ను చంపారని కుటుంబీకులు ఆరోపించారు. హత్యకు గురైన ప్రేమ్ సాగర్ కు భార్య, ప్రమీల ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతుల్లో మరొకరు నిజామాబాద్ జిల్లా(NIjamabad District) కు చెందిన శ్రీనివాస్ అని వారి సహోద్యోగులు తెలిపారు. గాయపడిన ఇద్దరు వ్యక్తులు కూడా తెలుగువారేనని తెలుస్తోంది. మృతులు , గాయపడిన వారితో పాటు ఈ ఘాతుకానికి పాల్పడిన పాకిస్థానీ వ్యక్తి కూడా దుబాయిలోని ఒక ప్రఖ్యాత బేకరీలో పనిచేస్తున్నారు. పని ఒత్తిడి, ఇతర వ్యక్తిగత కారణాలతో పాటు మత విద్వేషం కూడా ఈ దారుణానికి దారితీసిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితుడు వారిని చంపిన తర్వాత మతపరమైన నినాదాలు చేశాడని కొన్ని కథనాలు సూచిస్తున్నాయి.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
