YSRCP DSC Protest
* 28 మందికి బెయిల్
ఆకేరు న్యూస్, విజయవాడ : విజయవాడలో DSC ధర్నా సందర్భంగా నమోదైన కేసులో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ధర్నాలో పాల్గొన్న 30 మందిపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. పరీక్షలు పూర్తైన తర్వాత 30 మందినీ కోర్టులో హాజరుపరిచారు.
కేసును విచారించిన కోర్టు.. 30 మందిలో 28 మందికి బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో ఇద్దరు నిందితులు రాజశేఖర్, చెన్నారావులకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో వారిని రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించే ప్రక్రియను పోలీసులు చేపట్టారు.
DSC ధర్నా సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
