GWMC Commissioner Venkanna
అకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ఆవరణలో బల్దియా సహకారంతో హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్ (రూ.5 భోజనం)ను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వెంకన్న శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా క్యాంటీన్ ద్వారా అందిస్తున్న భోజనం, పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, వడ్డించే విధానం తదితర అంశాలను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. వినియోగదారులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూసి ఆహార నాణ్యతను పరిశీలించారు.
అలాగే, క్యాంటీన్ భోజనం చేస్తున్న వినియోగదారులతో కమిషనర్ నేరుగా మాట్లాడి భోజనం రుచి, నాణ్యత, అందిస్తున్న సేవలు, పరిశుభ్రతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రూ.5కే అందిస్తున్న భోజనం నాణ్యంగా, రుచికరంగా ఉండేలా నిర్వాహకులు నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించారు.

ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు, పేదలు మరియు ఇతరులకు అందుబాటులో ఉండే ఈ సేవలో ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని కమిషనర్ స్పష్టం చేశారు. క్యాంటీన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, ఆహార పదార్థాలను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వినియోగించాలని సూచించారు.
కమిషనర్ వెంట ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
