Nepal Floods Death Toll
* నేపాల్లో వరద బీభత్సం..
అకేరు న్యూస్ డెస్క్ : నేపాల్లో భారీ వరదలు, ఆకస్మిక వరదలతో పరిస్థితి భీతావహంగా మారింది. మృతుల సంఖ్య 538కు చేరినట్లు నేపాల్ విపత్తు నిర్వహణ అధికారులు ప్రకటించారు. మరోవైపు గల్లంతైన వారి కోసం భారీగా గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వరదల్లో చిక్కుకున్న 121 మంది విదేశీయులను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 85 మంది భారతీయులు, 16 మంది చైనీయులు, 8 మంది దక్షిణ కొరియన్లు, ఇద్దరు అమెరికన్లు, ఇద్దరు రష్యన్లు, ఇద్దరు ఇటాలియన్లు ఉన్నట్లు సమాచారం.
హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే కొండ ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో సహాయక బృందాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
