కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత చీటూరి అశోక్ ,
* వరంగల్ పార్లమెంట్ టికెట్ ఆశించి భంగపడ్డ చీటూరి
* కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగ్గారెడ్డి
ఆకేరు న్యూస్, వరంగల్ : బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చీటూరి అశోక్ ( Cheeturi Ashok ) కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ( Jagga reddy ) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్ పార్లమెంట్ టికెట్ ఆశించి చీటూరి భంగపడ్డారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సారథ్యంలో అశోక్ తో పాటు ఆయన అనుచరులు కూడా బీజేపీలో చేరారు. ఈ సంధర్భంగా అశోక్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ తనను మోసం చేసిందన్నారు. నోటిఫికేషన్‌కు ముందు వరకు తనకే వరంగల్ పార్లమెంట్ సీటు ఇస్తామని బీజేపీ నేతలు నమ్మ బలికారన్నారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ప్రజల చేతిలో దారుణంగా ఓటమి పాలయిన ఆరూరి రమేశ్‌కు టికెట్ కెటాయించారన్నారు. పార్టీ కోసం తాను చేసిన సేవలను కూడా పార్టీ నేతలు పట్టించుకోక పోవడం చాలా ఆవేదనకు గురి చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన పాలనా దక్షతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నాడన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని చీటూరి అశోక్ అన్నారు.
——————————————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
