Warangal Police Station Incident
* పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వ్యక్తి
* ఇద్దరు పోలీసులకు గాయాలు
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కట్ల హర్షిత్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని పోలీస్ స్టేషన్లోకి పరుగెత్తినట్లు సమాచారం. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య వివాదం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన హర్షిత్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు సమాచారం.
మంటలతో పోలీస్ స్టేషన్లోకి వచ్చిన హర్షిత్‌ను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనలో హర్షిత్‌తో పాటు రైటర్ ప్రవీణ్, హెడ్ కానిస్టేబుల్ మగ్దూం గాయపడినట్లు తెలిసింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
