చనిపోయాడనుకున్న వ్యక్తిని ఒడ్డుకు లాగుతున్న పోలీస్ కానిస్టేబుల్.. లేచి కూర్చున్న వ్యక్తి..
* హనుమకొండలో వింత సంఘటన
* అవాక్కయిన పోలీసులు
ఆకేరు న్యూస్ , హనుమకొండ: శవం లేచింది.. నిజమే ఇదీ.. పోలీసులు, 108 సిబ్బంది అవాక్కయ్యారు.. ఈ వింత సంఘటన హనుమకొండలో జరిగింది.వివరాల్లోకి వెళితే . గ్రేటర్ వరంగల్ ( Warangal ) రెండవ డివిజన్లో కోవెల కుంట అనే అనే కుంట ( చిన్న చెరువు ) లో ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు ఒక శవం తేలియాడుతున్నది. పాపం ఎవరో ఇదీ గమనించిన స్థానికులు పోలీసులకు. 108 కు సమాచారం ఇచ్చారు. దీంతో హుటా హుటిన వారు అక్కడకు చేరుకున్నారు. శవం నీటిలో తేలియాడుతోంది.. పోలీసు కానిస్టేబుల్ జాగ్రత్తగా శవం చేతిని పట్టకుని ఒడ్డుకు లాగే ప్రయత్నం చేశాడు.. అంతే ఒక్కసారిగా శవంలో కదలికలు .. హాయిగా నీటిలో సేద తీరుతుంటే ఎవరు డిస్టర్బ్ చేసేది ఎవరన్నట్టు కోపం గా చూశాడు.. యూని ఫాంలో ఉన్న పోలీస్ కనబడడంతో సారూ సల్ల బడ్డాడు.. గంటల కొద్దీ నీళ్ళల్లో నిద్ర పోతున్నవ్ ఎంటీ సంగతీ .. మందు తాగినవా అని పోలీస్లు ప్రశ్నించడంతో .. ఆ …ఏమిలేదు సర్.. గ్రానైట్ కంపెనీలో 12 గంటలు బాగా కష్టపడుతా.. ఎండకు తట్టుకోలేక సల్లదనానికి ఈ చెరువులో పండుకున్న సార్ అని చెప్పడంతో అవాక్కవడం పోలీసుల వంతయింది. ఒక్క యాభై రూపాయలు ఇస్తే .. కాజీపేటకు పోతా సర్ అని పోలీసులనే డబ్బుల అడగడం కొసమెరుపు.. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఇతను కాజీపేటలోని గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్నాడు.
———————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
