* అన్ని కోణాల్లో విచారణ ప్రారంభించిన పోలీసులు
* గతంలో భాను హత్య కేసులో ఏ2 నిందితుడిగా చందూ
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః సీపీఐ నేత చందూ రాథోడ్ మృతికి భూవివాదాలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఉదయం మార్నింగ్ వాక్ కుయ వెళ్లిన చందు రాథోడ్ ను గుర్తు తెలియిని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. కాల్పుల్లో చందు రాథోడ్ అక్కడిక్కడే మృతి చెందారు. చందూ హత్యపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. చందుకు రాజేష్ ఖన్నా అనే వ్యక్తితో విభేదాలు ఉన్నట్లు సమాచారం , ఈ హత్య వెనుక రాజేష్ హస్తం ఉన్నట్లు చందు రాథోడ్ కుటుంబసభ్యలు ఆరోపిస్తున్నారు. గతంలో నాగోల్ భూ వివాదంలో భాను అనే వ్యక్తితో చందుకు గొడవలు ఉన్నట్లు సమాచారం, మూడేళ్ల క్రితం భాను హత్యకు గురికాగా భాను హత్య కేసులో చందు ఏ2 నిందితుడుగా ఉన్నట్లు తెలిసింది.
………………………………..
