* ఖాన్ కు మరోసారి బెదిరింపులు
ఆకేరు న్యూస్, డెస్క్ : బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్(Salmankhan)కు మరో సారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ముంబయి వర్లి రవాణాశాఖ కార్యాలయం నంబర్‌కు వాట్సప్ ద్వారా ఈమేరకు మెసేజ్ వచ్చింది. సల్మాన్‌ను ఆయన ఇంట్లోకి చొరబడి కాల్చేస్తామని, లేకుంటే కారులో బాంబు పెట్టి పేల్చి చంపుతామని అందులో అగంతుకులు పేర్కొన్నారు. బాంబు బెదిరింపుపై వర్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ మెసేజ్‌ను పంపిన వ్యక్తిని కనిపెట్టే పనిలో ఉన్నారు. సల్మాన్‌ఖాన్‌కు చంపేస్తాం అంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Bishnoy Gang) నుంచి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ గతంలో ముంబయి (Mumbai)ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్‌కు సందేశం వచ్చింది. ఒక వేళ ఆ మొత్తాన్ని సల్మాన్ చెల్లించకపోతే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని గతంలో వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా మరోసారి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
