* ములుగు జిల్లా ఎస్పీ శబరీష్.పి
ఆకేరు న్యూస్, ములుగు: ద్విచక్ర వాహన చోదకులు మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని ములుగు ఎస్పి శబరిష్ కోరారు ములుగు జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు భద్రత నియమాలపై ప్రజలకు వివిధ మాధ్యమాల ద్వారా, కార్యక్రమాల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిశీలించగా ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ ధరించకపోవడం వలన అధిక మరణాలు సంభవించినట్లు తాము గమనించినట్లు వివరించారు.ఇందులో బాగంగా ప్రజలలో ద్విచక్ర వాహన చోదకులలో మార్పు తెచ్చే విధంగా స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్ ఓ లను ఆదేశించామని తెలియజేశారు. 4 రోజులలో 1949 మందికి రూ.3,12,855/- జరిమానా విధించడం జరిగిందని తెలియజేశారు. ద్విచక్ర వాహన చోదకులు విధిగా, బాధ్యతగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, రోడ్డు ప్రమాదాలలో విలువైన తమ ప్రాణాలు కోల్పోకూడదు అని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లు జరిమానాల కోసం కాకుండా ప్రజలలో మార్పు కోసమే నిర్వహిస్తున్నట్ల ఎస్ పి తెలియచేశారు.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
