
* ట్రంప్ తరచుగా పిలిచే పేరు..
ఆకేరు న్యూస్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ రోజూ అన్ని దేశాల వార్తా పత్రికల్లో.. టీవీ చానళ్లలో..
యూ ట్యూబ్ చానళ్లలో.. సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడి పేరు కన్పిస్తోంది.. విన్పిస్తోంది.. అగ్ర రాజ్యంగా చలామణి అవుతున్న అమెరికా వార్తల్లో ఉండడం పెద్ద విశేషం ఏమీ కాదు.. అమెరికా అధ్యక్షునికి సంబందించిన వార్తలు ఏదో ఒకటి చక్కర్లు కొడుతుంటాయి.. అందులో ట్రంప్ లాంటి వారికి పబ్లిసిటీ మరీ ఎక్కువ, గతంలో ఉన్న అమెరికా అధ్యక్షులతో పోల్చుకుంటే ట్రంప్ ప్రతీ రోజూ ఏదో విధంగా వార్తల్లో ఉంటారు. అది ఆయన స్టైల్ అని చెప్పవచ్చు..మరి ట్రంప్ నోట తరచుగా పీటర్ అనే పేరు విన్పిస్తూ ఉంటుంది.. ఎవరీ పీటర్ అనే ఆసక్తి అందరికీ కలుగుతుంది.. మరి పీటర్ ఎవరు ఆయన నేపధ్యం ఏంటో తెలుసుకుందాం..పీటర్ డూసీ ఓ అమెరికన్ జర్నలిస్ట్..అతరు ప్యాక్స్ న్యూస్ కు వైట్ హౌస్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. పొలిటకల్ సైన్స్ లో పిజి పూర్తి చేసిన పీటర్ విద్యార్థి దశ నుండే జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు. జో బైడన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో పీటర్ డూసీ వైట్ హౌస్ కరస్పాండెంట్ గా నియమించబడ్డాడు. వృత్తిని గౌరవించే పీటర్ నిక్కచ్చిగా మాట్లాడతారు..నిర్మోహమాటంగా ప్రశ్నఅడుగుతారు.. ఈ కారణంగానే ఆయన పేరు అందరికీ సపరిచితం అయింది, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీతో ఘర్షణ పడటం ద్వారా అతను వెలుగులోకి వచ్చాడు అంతే కాకుండా 2014లో ఆపరేషన్ ఒసామీ బిన్ లాడెన్ లో కీలకపాత్ర పోషించిన మాజీ నేవీ సీల్ రాబర్ట్ జె. ఒనీల్ తో ఇంటర్వూ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆ ఇంటర్వ్యూకు ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేనంతగా రేటింగ్ వచ్చిందట. ఓ సందర్భంలో పీటర్ డూసీ బైడన్ తో ఇలా అన్నారు. మీ జ్ఞాపకశక్తి లో చాలా లోపం ఉంది మీరు ప్రెసిడెంట్ గా కొనసాగగలరా అని ప్రశ్నించారట.. ఈ ప్రశ్నకు బైడన్ అసహనానికి గురై నా జ్ఞాపక శక్తిలో లోపం ఉంది కాబట్టే నిన్ను నీకు మాట్లాడే అవకాశం ఇచ్చాను అన్నారట..ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ని కూడా పీటర్ డూసీ ప్రభావితం చేశాడని అందుకే ట్రంప్ నోటీ వెంట పీటర్ పీటర్ ..అనే పిలుపు తరచుగా వస్తూ ఉంటుందని అనుకుంటున్నారు. గతంలో కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు ప్రెస్ కాన్ఫరెన్సుల్లో రాహుల్.. రాహుల్ అనే పేరు తరుచుగా విన్పించేది.. అప్పుడు ఎవరీ రాహుల్ అనే ఆసక్తి తెలుగు వారిక ఉండేది.. ఇప్పడు ఎవరీ డూసీ అని అంతర్జాతీయంగా ఆసక్తి కలిగిస్తోంది.
…………………………………………..