
* ఉజ్జయిని మహంకాళి మాతంగి స్వర్ణలత ఘాటైన హెచ్చరిక
* ఉగ్రరూపంలో కన్పించిన మాతంగి స్వర్ణలత
* తెలంగాణ ప్రజలకు భవిష్యవాణి విన్పించిన మాతంగి స్వర్ణలత
* భవిష్యవాణి హెచ్చరికపై చర్చించుకుంటున్న భక్తులు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ ః ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో సోమవారం రంగం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రంగం కార్యక్రమంలో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి విన్పించారు. అమ్మ వారి పూజలన్నీ సక్రమంగా జరిపించాలని లేదంటే తన కోపానికి బలి కాకతప్పదని హెచ్చరించారు. తాను కోపం చూపించడంలేదని తాను కన్నెర్ర జేస్తే రక్తం కక్కుకొని చస్తారు అంటూ కన్నెర్ర జేశారు. రాబోయే రాజుల్లో అందరికీ తోడుగా ఉంటా.. అందరిని రక్షిస్తా సమృద్ధిగా వర్షాలు పడతాయి అంటూనే హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రోజుల్లో కరోనా లాంటి మరో మహమ్మారి విజృంభిస్తుందన్నారు.. అగ్రిప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తాయని హెచ్చరికలు జారీచేశారు,
భవిష్యవాణిలో మాతంగి చెప్పిన మాటలు ఇవే..
ఎంత చెప్పినా వినడంలేదని అయినా కోపగించకుండా సరిపెట్టుకుంటున్నారు అన్నారు. తాను కనుక కోపం చేస్తే ఫలితం తీవ్రంగా ఉంటుంది అన్నారు. ఈ దేశాన్ని కాపాడే బాధ్యత తనదన్నారు. రానున్న రోజుల్లో కరోనా లాంటి మరో మహమ్మారి విజృంభిస్తుందని హెచ్చరించారు. అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని హెచ్చరించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ప్రవస్తిస్తున్న తీరు బాగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనంలో నిజాయితీ కరువైందన్నారు. మాటల మీద నిలకడ ఉండడం లేదని హెచ్చరించారు. ఈ ఏడాది వ్యవసాయ దారులు సంతోషంగా ఉంటారని భారీ గా వర్షాలు పడతాయని అన్నారు.ఈ జాతర ఐదు వారాలపాటు పప్పు, బెల్లం , ఫలహారం, పసుపు, కుంకుమలతో, వేపాకులతో శోభాయమానంగా ఉండాలని కోరారు. నాలుగు వారాల్లో తన ఎదుట రక్తం చూపించకపోతే తాను ఊరుకోను అని హెచ్చరించారు.
……………………………………………………….