ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నా వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం
– అధికారికంగా మారిన ముద్రగడ పేరు
ఆకేరు న్యూస్, విజయవాడ : వైసీపీ నాయకుడు (YCP leader) ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) చాలెంజ్(Challenge) కు కట్టుబడి నిలబడ్డారు. కాపు నాయకుడిగా పేరున్న ఆయన.. పిఠాపురం (Pithapuram) లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను ఓడించకపోతే తన పేరు రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ (Challenge) విసిరారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజార్టీతో గెలవడంతో ఆయన పేరు మార్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మర్నాడే పేరు మార్పునకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించారు. ముద్రగడ పద్మనాభం(Padmanabham) పేరును మారుస్తూ గెజిట్ విడుదల చేసింది ప్రభుత్వం. ముద్రగడ పద్మనాభం పేరును ఇకపై ముద్రగడ పద్మనాభ రెడ్డి (Mudragada Padmanabha Reddy) గా మారుస్తూ ఉత్తర్వులు వచ్చాయి..
—————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
