Husband Kills Wife in Front of Children in Hanamkonda
* కట్టుకున్న భార్యను కడతేర్చిన భర్త..
* హన్మకొండలో దారుణం
ఆకేరు న్యూస్, హనుమకొండ : హనుమకొండ లో దారుణం జరిగింది. చిన్నారుల ముందే భార్యను కట్టేసి మరీ గొంతుకోసం భర్త చంపేశాడు. కాకతీయ యూనివర్సిటీ పోలీసుల కథనం ప్రకారం ..జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల తండాకు చెందిన గుగులోతు రజిత (26), వరంగల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేటకు చెందిన పోశాల అనిల్ కొంతకాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు . అనిల్ దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బతుకు దెరువు కోసం వీరు హన్మకొండలోని కృష్ణకాలనీలో కొంతకాలంగా అద్దెకు ఉంటున్నారు. పెళ్లయిన కొత్తలో సజావుగా సాగిన వీరి కాపురంలో, కొద్ది రోజులుగా మనస్పర్థలు తలెత్తాయి. తరచూ చిన్నచిన్న విషయాలకే గొడవలు జరగడం, అవి కాస్తా క్రమంగా తీవ్రరూపం దాల్చడం జరిగాయి. ఈ క్రమంలోనే శనివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం.
. భార్య రజిత చేతులు, కాళ్లను కట్టేసి, కత్తితో గొంతు కోసి అనిల్ దారుణంగా హతమార్చాడు. ఈ దారుణాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే కేయూ పోలీసులకు సమాచారం అందించారు.
* మమ్మిని నాన్నే చంపేశాడు
సమాచారం అందిన వెంటనే కేయూ ఏసీపీ నర్సింహారావు, సీఐ సుంకరి రవికుమార్, ఎస్సై నవీన్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు.
తమ తల్లిని తండ్రి ఎలా చంపాడో పోలీసులకు ఆ చిన్నారులు వివరించినట్లు గా తెలిసింది.. మమ్మీని తాళ్ళతో కట్టేసి ..ఇట్లా చంపాడు.. అట్లా కొట్టాడు అని చెబుతుంటే కాలనీ వాసులు కంటతడి పెట్టుకున్నారు.. పాపం .. తల్లి చనిపోయింది.. తండ్రి జైలుకు… ఆ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడి కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
——————————————

Please tell us what is wrong. Your report will be sent to the website team.
