విజయవాడలో ఐ ప్యాక్ బృందంతో సమావేశమైన జగన్
* ఆ ఫలితాలతో దేశం మొత్తం మనవైపే చూస్తుంది
* 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీల మార్క్ దాటుతాం
* ప్రశాంత్ కిషోర్ కలలో కూడా ఊహించని ఫలితాలు వస్తాయి
* ఐ ప్యాక్ బృందంతో జగన్ కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారంలోకి వస్తున్నామని, రాబోయే ఫలితాలతో దేశం మొత్తం మనవైపే చూస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లపాటు ప్రజలకు మంచి పాలన అందించామని, ప్రజలు మనకు మంచి ఫలితాలు అందించబోతున్నారని వెల్లడించారు. జూన్ 4న వచ్చే ఫలితాలను చూసి.., దేశంలోని అన్ని రాష్ట్రాలూ మనల్నే చూస్తాయన్నారు. ఐ ప్యాక్ సేవలు మరువలేనివని తెలిపారు. విజయవాడలోని ఐ ప్యాక్ బృందంతో సమావేశమైన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి గతం కన్నా ఎక్కువ ఫలితాలు వస్తాయన్నారు. 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీల మార్క్ దాటబోతున్నామని చెప్పారు.
ప్రశాంత్ కిషోర్ కు కౌంటర్
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు జగన్ కౌంటర్ ఇచ్చారు. ఆయన మధ్యలో మాట మార్చాడాని, పీకే కూడా కలలో ఊహించని ఫలితాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. ఏడాదిన్నరగా ఐప్యాక్ బృందం చేస్తున్న గొప్పదని కొనియాడారు. గతంలో పీకే ఐప్యాక్ బృందంలో ఉండేవారు. కొద్ది కాలం క్రితం ఆయన ఆ బృందం నుంచి బయటకు వచ్చేశారు. జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.
————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
