కేటీఆర్ కారులో తనిఖీలు…సహకరించిన కేటీఆర్…!!
ఆకేరు న్యూస్:
హైదరాబాద్:రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, KTR వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.కేటీఆర్ తన రాజకీయ పర్యటనలోవెళ్తుండగా, మార్గమధ్యంలో తనిఖీ కేంద్రం వద్ద ఎన్నికల సిబ్బంది ఆయన వాహనాన్ని ఆపారు. కేటీఆర్, ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా వాహనాన్ని పక్కకు ఆపి తనిఖీకి సహకరించారు.అధికారులు కారులోని డిక్కీని, సీట్ల కింద మరియు ఇతర బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు ముగిసిన తర్వాత అధికారులు ‘ఓకే’ చెప్పడంతో ఆయన అక్కడి నుంచి తన పర్యటనకు బయలుదేరి వెళ్లారు.గతంలో కూడా పలువురు కీలక నేతల వాహనాలను అధికారులు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే.
