సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జువల్ ఓరం
ఆకేరు న్యూస్:
మేడారం:తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ మహాజాతరను పురస్కరించుకుని కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయల్ ఓరం అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవార్ల మొక్కుల్లో భాగంగా కేంద్ర మంత్రులు ఇద్దరూ తమ బరువుకు సమానమైన నిలువెత్తు బంగారాన్ని (బెల్లాన్ని) తులాభారం ద్వారా సమర్పించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 75 కిలోల బెల్లాన్ని మొక్కుగా చెల్లించుకున్నారు. కేంద్ర గిరిజన మంత్రి జుయల్ ఓరం 86 కిలోల బెల్లాన్ని సమర్పించారు. మేడారానికి చేరుకున్న కేంద్ర మంత్రులకు జిల్లా కలెక్టర్ దివాకర, పోలీసులు మరియు ఆలయ పూజారులు సంప్రదాయబద్ధంగా ‘డప్పులు – డోలు’ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అల్లోల లక్ష్మణ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రులకు జాతర విశేషాలను వివరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మంత్రులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
