* రాజధాని స్థాయిలో పనులు చేపడుతాం
* విపక్షాలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి..
* మంత్రి శ్రీధర్‌బాబు
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్(WARANGAL)ను రాజధాని స్థాయిలో అభివృద్ధి చేస్తామని, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (SRIDHAR BABU) తెలిపారు. శనివారం వరంగల్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. కీర్తినగర్‌లో రూ. 50 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు(KAKATIYA MEGA TEXTILE PARK)ను సందర్శించారు. అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీను మేనిఫెస్టోలో పెట్టామని, ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇచ్చారని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా సోదరీమణులకు ఉచిత బస్సు (FREE BUS)ప్రయాణాన్ని అమలు చేశామన్నారు. గత సంవత్సరం డిసెంబర్ 9న ప్రారంభించిన ఈ పథకం ద్వారా సంవత్సర కాలంలో 120 కోట్ల ఉచిత బస్సు టికెట్లను మహిళలకు అందించామని వివరించారు. 500కే ఇంటింటికీ సిలిండర్ ఇస్తున్నామన్నారు. పేదవాడికి ఒక్క రూపాయి కూడా వైద్యానికి ఖర్చు కాకూడదని, రాజీవ్ ఆరోగ్య శ్రీ(RAJIV AROGYASRI)ని రూ. పది లక్షల రూపాయలకు పెంచామన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తీవ్ర అప్పుల్లోకి నెట్టిందని, వారు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ సంక్షేమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అయినప్పటికీ,.. పనిలేక ప్రజల్ని ప్రతిపక్షాలు రెచ్చడొడుతున్నాయని విమర్శించారు.
……………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
