* మూలమలుపే ముంచేసింది…
* యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐదుగురు యువకుల జలసమాధి
* మృతులు హైదరాబాద్ ఎల్బీనగర్ వాసులుగా గుర్తింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
రా బిడ్డా.. నైట్ టైం ఏం చేస్తున్నావ్ అంటే.. వస్తున్నా మమ్మీ అన్నాడు.. వచ్చేస్తున్నా అని మెసేజ్ కూడా చేశాడు..
రాత్రి నాలుగు గంటలకు ఫోన్ చేసి.. డాడీ.. 350 రూపాయలు ఫోన్ పే కొట్టు అన్నాడు..
కాలేజీకి వెళ్లినప్పుడు అన్నం పెట్టి పంపించినా.. మళ్లీ బిడ్డ తిరిగి రాలేదు..
బ్రాండెడ్ షర్ట్ తీసుకున్నా.. డాడీని డబ్బులు కొట్టమను చెప్పు మమ్మీ అన్నాడు… అంటూ ఆ బిడ్డల తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిన పిల్లలు ఇలా విగతజీవులుగా మారతారని అనుకోలేదని కన్నీరుమున్నీరవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమా ఘోరరోడ్డు ప్రమాదం ఐదు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. చెరువులో మునిగి చనిపోయిన వారి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. వారందరూ హైదరాబాద్ ఎల్బీనగర్ కు చెందిన వారిగా గుర్తించారు. ఎల్బీనగర్ నుంచి భూదాన్ పోచంపల్లికి వచ్చే క్రమంలో చెరువు సమీపంలోని మూలమలుపును గమనించకుండా అతివేగంతో కారు చెరువులోకి దూసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదం నుంచి మణికంఠ సురక్షితంగా బయటప్డడాడు. పోచంపల్లిలో తెల్లవారుజామునే లబ్యమయ్యే ఈత కళ్లు కోసం బయలుదేరినట్లుగా పోలీసులు పేర్కొంటున్నారు.
……………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
