* మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సీఎం రేవంత్‌కు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ డ్యామేజ్ చేశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడి చేయడం సరికాదన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అల్లు అర్జున్ సినిమాకు రూ.2వేలకోట్లు వసూలు చేశారని.. బాధితులకు రూ.10కోట్లు ఇస్తే పోయేదేముందని ప్రశ్నించారు. ఐకాన్‌స్టార్‌ని అరెస్ట్ చేస్తారా? అని అంటున్నారని.. మనిషి చనిపోయాక ఐకాన్ స్టార్ అయితే ఏంటీ? సూపర్‌స్టార్ అయితే ఏంటీ? చట్టానికి ఎవరూ చుట్టాలు కాదన్నారు. హీరో అయినా.. ఎమ్మెల్యే అయినా చట్టానికి అందరూ సమానమేనన్నారు. మీరు రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే మాకేం సంబంధం అని ప్రశ్నించారు. దేశభక్తులు, తెలంగాణపై సినిమాలు తీస్తేనే బెనిఫిట్స్ కల్పిస్తామన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. ఎవరు చెప్పినా వినేది లేదన్నారు.
………………………………………………….