
* ఈ సీజన్లో ఇదే తొలి కేసు
ఆకేరున్యూస్, అస్సాం: అస్సాంలో తొలి హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ కేసు నమోదైంది. 10 నెలల చిన్నారికి హెచ్‌ఎమ్‌పీవీ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఈ సీజన్లో ఇదే తొలి కేసు అని అధికారులు వెల్లడిరచారు. బాధిత చిన్నారి దిబ్రూఘర్‌లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతుందని.. నాలుగు రోజుల క్రితం చలి సంబంధిత లక్షణాలతో చిన్నారి ఆసుపత్రిలో చేరినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పేర్కొన్నారు.
……………………………………