ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం(Road Accident)లో ముగ్గురు దుర్మరణం చెందారు. భూరెడ్డిపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మరో 15 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు టైర్ బరస్ట్ (Car Tire Burrest)కావడంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. ఆ వెనుకే వస్తున్న లారీ డ్రైవర్ కూడా ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. లారీ వెనుక హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengalure)వస్తున్న ఓ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
