* అంతర్జాతీయ లయన్స్ క్లబ్ 320ఎఫ్ జిల్లా గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి
ఆకేరున్యూస్, భీమదేవరపల్లి: లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలకు యువత ముందుకు రావాలని అంతర్జాతీయ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320ఎఫ్ జిల్లా గవర్నర్ లయన్ కె.వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
మాజీ ప్రధాని భారతరత్న పి.వి.స్వస్థలం వంగరలోని పి.వి.మనోహర్ రావు వ్యవసాయ క్షేత్రంలో శనివారంనాడు సాయంత్రం నుండి రాత్రి వరకు నిర్వహించిన లయన్స్ క్లబ్ థౌజండ్ పిల్లర్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుధీర్గ చరిత్ర కలిగిన లయన్స్ క్లబ్ సామాజిక సేవలతో పాటు అవసరార్థులకు ఎన్నో కార్యక్రమాలు అందించి పేరుగడిస్తున్న సంగతిని గుర్తుచేశారు. క్లబ్ బలోపేతానకి పటిష్ఠమైన సభ్యత్వం ముఖ్యమని ఆర్థికంగా వివిధ రంగాలలో స్థిరపడ్డ వారు లయనిజంలో చేరాలని ఇందులో యువత భాగస్వామ్యం కావాలని వెంకటరెడ్డి పేర్కొన్నారు. జిల్లా ఉప గవర్నర్2 నరహరి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ థౌజండ్ పిల్లర్స్ చేస్తున్న కార్యక్రమాల ద్వారా తనకు జిల్లా ఉపగవర్నర్ అవకాశం దక్కిందని సమాజ సేవలో ముందుండే వారికి మరిన్ని అవకాశాలు దక్కుతాయని తెలిపారు.మనం ఎంత సంపాదిస్తామన్నది ముఖ్యం కాదని అందులో కొంత సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని కోరారు. భారతరత్న మాజీ ప్రధాని పి.వి.పేర లయన్స్ క్లబ్ శాఖను ఏర్పాటు చేసేందుకు వంగర భీమదేవరపల్లి మండల వాసులు ముందుకు రావాలని సుధాకర్ రెడ్డి సూచించారు.
సీనియర్ లయన్ పెద్ది వెంకటనారాయణ గౌడు మాట్లాడుతూ తాను లయన్స్ క్లబ్ థౌజండ్ పిల్లర్స్ చేపట్టిన అనేక కార్యక్రమాలలో భాగస్వామ్యం అయినానని కొన్ని కారణాల వల్ల తన సభ్యత్వం జనగామకు బదిలీ అయిందని తెలిపారు. లయన్స్ క్లబ్ కార్యక్రమాలు భీమదేవరపల్లి మండలంలో విజయవంతంగా కొనసాగడానికి క్రుషి చేస్తానని తెలిపారు. కార్యక్రమాన్ని వంగర గ్రామంలో ఏర్పాటు చేసేందుకు సహకారాన్ని అందించిన సీనియర్ జర్నలిస్టు, సీనియర్ లయన్ పి.వి.మదన్ మోహన్ మాట్లాడుతూ లయనిజం వల్ల సమాజంలో అన్ని వర్గాల ప్రజలతో పరిచయాలు ఏర్పడడం ద్వార ఒక ఆత్మీయ బంధుత్వం ఏర్పడుతుందని ఏ సమస్య వచ్చినా ముందుకు వచ్చే మనస్తత్వం సభ్యుల్లో వుంటుందని తెలిపారు. గత తొమ్మిది సంవత్సరాల క్రితం వంగరలో ఆతిథ్యం యిచ్చిన సంగతి గుర్తుచేశారు.లయనిజంలో వున్న సభ్యులకు వంటగ్యాస్ ప్రమాదాలపై అవగాహన వుండాలని కోరారు. వంటగ్యాస్ భద్రతపై అవగాహన కల్పించే భాద్యతలు లయన్స్ క్లబ్ సంస్థలు తీసుకోవాలని కోరారు. గ్యాస్ లీకేజి సమయంలో టోల్ ప్రీ 1906 సమాచారం ఇవ్వాలని, సురక్ష రబ్బరు ట్యూబులు విధిగా వాడాలని దీని కాలపరిమితి ఐదు సంవత్సరాలని రబ్బరు ట్యూబ్ పై తయరీ తేది.కాలపరిమితి తేది ముద్రించబడి ఉంటుందని దానిని గమనించి సురక్ష రబ్బరు ట్యూబులు మార్చాలని సూచించారు. సభాద్యక్షులు లయన్ చొప్పరి సోమయ్య మాట్లాడుతూ అంతర్జాతీయ లయన్స్ క్లబ్ క్యాలండెరిక్ ఈవెంట్ల ప్రకారం థౌజండ్ ఫిల్లర్స్ లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అంతకుముందు క్లబ్ సభ్యులు పేరొందిన వంగర కైలాస కళ్యాణి క్షేత్రాన్ని సందర్శించి అభిషేకాలు నిర్వహించారు..
ఈ సందర్భంగా మదన్ మోహన్ లయన్ ముఖ్యులను సత్కరించారు.అనంతరం పి.వి.కుమారుడు పి.వి.ప్రభాకర్ రావు ఏర్పాటు చేసిన పి.వి.మ్యూజియం సందర్శించి పి.వి.నరసింహారావు విగ్రహానకి పుష్పాంజలి ఘటించి పి.వి.ఎగ్జిబిట్లను,వాడిన వస్తువులను తిలకించారు.తేనీటీ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపగవర్నర్1 చంద్రశేఖర్ ఆర్యా,సంస్థ కార్యదర్శి వెంకన్న, కోశాధికారి రవి, సీనియర్ లయన్స్ దయాకర్, సంజీవయ్య, వామన్ రావు, సత్యం,ఉపేందర్,పాము సీను,చంద్రశేఖర్,రణధీర్ రెడ్డి,దడిగల సీను,పరికిపండ్ల వేణు,కరుణాకర్ రెడ్డి, తాల్లపల్లి సురేశ్ వంగర గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి,భీం రెడ్డి, రమేశ్,మొండయ్య,సతీష్ రెడ్డి,తిరుపతి రెడ్డి,కొత్తకొత్త దేవ స్థాన కమిటీ సభ్యలు శ్రీనివాస్,గోపాల్ రెడి,ముఖేశ్,నర్సయ్య, ప్రభు, బుచ్చిరెడ్డి,సియచ్.గోపాల్,మల్లారెడ్డి పాల్గొన్నారు.

………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
