* తెలంగాణ ప్రభుత్వంతో యూనిలీవర్ ఒప్పందం
ఆకేరున్యూస్, హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు యూనిలీవర్ ముందుకు వచ్చింది. ఇక్కడ పామాయిల్ పెంపకం కారణంగా యూనిట్ పెట్టాలని దావోస్‌లో జరిగిన సమావేశంలో సిఎం రేవంత్ చేసిన సూచనలను అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్ బృందం పేర్కొంది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ప్రభుత్వం తొలి ఒప్పందం కుదుర్చుకుంది.
దావోస్‌లో యూనిలీవర్ సీఈఓ హీన్ షూమేకర్, చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం సమావేశమయ్యారు. యూనిలీవర్ వంటి గ్లోబల్ దిగ్గజ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం, వ్యాపార అవకాశాలపై సీఎం రేవంత్ బృందం చర్చించారు. దావోస్‌లో జరగనున్న డబ్ల్యూఈఎఫ్ సందర్భంగా ప్రవాస భారతీయులతో భేటీకానున్నారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రణాళికలను రూపొందించినట్లు సమాచారం.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
