* లారీ బోల్తా పడడంతో 10 మంది రైతులు దుర్మరణం
ఆకేరు న్యూస్, డెస్క్ : కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఘోర ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. లారీ బోల్తా పడి 10 మంది రైతులు (Former) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. కూరగాయల లోడ్‌తో వెళ్తుండగా లారీ బోల్తాపడడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక(Karnataka)లోని సావనూర్ కు చెందిన రైతులు తాము పండించిన కూరగాయలను కుంత మార్కెట్ లో అమ్మేందుకు లారీలో బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న లారీ ఎల్లాపూర్ తాలూకాలో అరేబైల్- గుల్లాపురా మధ్య హైవేపై అదుపుతప్పింది. రోడ్డు పక్కనే ఉన్న 50 మీటర్ల లోయలో పడిపోయింది. దీంతో లారీలో కూర్చున్న రైతులు పదిమంది చనిపోగా మరో పదిహేను మంది గాయపడ్డారు. పోలీసులు గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
