* దిగ్భ్రాంతి చెందిన సీఎం చంద్రబాబు
ఆకేరు న్యూస్ డెస్క్ : లారీ బోల్తా పడి 10 మంది రైతులు దుర్మరణం చెందిన ఘటన మరువకముందే, కర్ణాటక(Karnataka)లోనే మరో విషాదం చోటుచేసుకుంది. రాయచూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ(AP)వాసులు దుర్మరణం చెందారు. కర్నూలు(Karnool)కు చెందిన నలుగురు మరణించారు. ఏపీ నుంచి రఘనందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తుండగా రాయచూరు జిల్లా సింధనూరు వద్ద టైర్ పంక్చర్ (Tire Puncture) కావడంతో తుఫాన్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. వారి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.
విచారం వ్యక్తం చేసిన ఏపీ సీఎం
కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీవాసులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబునాయుడు (Cm Chandrababu Naidu)విచారం వ్యక్తం చేశారు. ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడం తనను కలిచి వేసిందని ట్విటర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డవారికి అవసరమైన వైద్య సాయం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
