* ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
* హాజరైన మంత్రులు, మెగాస్టార్ చిరంజీవి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ శివారులో అంతర్జాతీయ స్థాయిలో ఎకో ఫ్రెండ్లీ పార్కు (Eco Friendly Park) ఏర్పాటు చేశారు. 150 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy)ఈరోజు ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), మంత్రులు జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao), ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 25వేల జాతుల మొక్కలు, వృక్షాలతో థీమ్ పార్కు నిర్మించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి(Shankarpally) మండలం ప్రొద్దుటూరు గ్రామంలో అంతర్జాతీయ స్థాయిలో రామ్‌దేవ్‌రావు 150 ఎకరాలలో దీన్ని రూపొందించారు. దీని కోసం సుమారు రూ. 150కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో శిల్పానికి రూ. 5లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేశారు. 1,500 మంది కూర్చునేలా ఇండియాలోనే అతిపెద్ద హంపీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. 30 అడుగుల ఎత్తులో 20స్టెయిన్ లెస్ స్టీల్ శిల్పాలు ఏర్పాటు చేసి వాటిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. రూ. 50 కోట్లతో 12 ఎకరాలలో మ్యాన్‌మేడ్ బీచ్ ఏర్పాటు చేశారు. 40 గదులు, 20 కాటేజీలతో సుందరమైన సహజ రిసార్టు ద్వీపంగా తీర్చిదిద్దారు. పీవెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్, ఫొటో షూట్లకు ఎక్స్‌పీరియంను రామ్‌దేవ్‌రావు ఎంతో శ్రమకోర్చి ఏర్పాటు చేశారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
