ఆకేరు న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండలం దేశరాజు పల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు.మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన దేశరాజుపల్లి గ్రామంలో లబ్ధిదారులందరికీ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు వారి అకౌంట్లో జమ అయిన కృతజ్ఞతతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు చిత్రపటాలకు గ్రామస్తులతో కలిసి వ్యవసాయ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ రాణి మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ సముద్రాల కృష్ణ, మాజీ ఉపసర్పంచి మిట్టపల్లి సుభాష్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు సముద్రాల రమేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
