* ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 తొలి సెషన్
* మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు మలివిడత
* ఇంటర్ బోర్డు భారీ ఏర్పాట్లు
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రేపటినుంచి ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం మొదటిసారి సీసీ కెమెరాల నిఘాలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 208 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేశారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు ప్రాక్టికల్ పరీక్షలను పర్యవేక్షించనున్నారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
