* కేజ్రీవాల్, సిసిఓడియాల వల్లే ఢిల్లీ లూటీ
* ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: డబుల్ ఇంజన్ బిజెపి ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు గత పది సంవత్సరాల్లో పురోగమించాయని, కానీ ఆప్ ప్రభుత్వంతో ఢిల్లీ వెనుకబడిరదని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం జంగ్పురాలో ఒక బహిరంగ సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు. ఆప్ అధినేత అర్వింద్ కేజీవ్రాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు ఢిల్లీని లూటీ చేశారని ఆరోపించారు. ’డబుల్ ఇంజన్ బిజెపి ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు గడచిన పది సంవత్సరాల్లో ప్రగతి సాధించాయి. ఢిల్లీ వెనుకబడిరది. వారు సాకులు చెబుతూ, ఏడుపుగొట్టు పిల్ల వలె కేంద్రంతో పోరాడసాగారని కేంద్ర హోమ్ శాఖ మంత్రి పేర్కొన్నారు. జంగ్పురా అసెంబ్లీ సీటు నుంచి బిజెపి అభ్యర్థి తార్విందర్ సింగ్ మార్వాప్ాపై పోటీ చేస్తున్న సిసోడియాపై అమిత్ షా సరికొత్త విమర్శనాస్త్రాలు సంధిస్తూ, మద్యం కుంభకోణం సందర్భంగా జైలుకు వెళ్లిన దేశంలో ఏకైక విద్యా శాఖ మంత్రి ఆయనే అని ఎద్దేవా చేశారు. కేజీవ్రాల్ ఢల్లీి ప్రజలకు అబద్దాలు చెప్పారని, వారికి ఆయన చెత్త, విషపు నీరు, అవినీతి మాత్రమే ఇచ్చారని అమిత్ షా ఆరోపించారు.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
