మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
* కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ఆకేరున్యూస్, నల్గొండ : కాంగ్రెస్ పార్టీలో గ్రూపు విభేదాలు, అంతర్గత కలహాలు లేవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉంటారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ షిండేలు లేరని అన్నారు. రంజాన్ సందర్భంగా పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డితో కలిసి నల్గొండ ఈద్గాను సందర్శించిన వెంకటరెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని విమర్శించారు. జరగబోయే ఎన్నికలు దేశ ఐక్యతకు నిదర్శనం అన్నారు. ఏక్నాథ్ లను సృష్టించిందే బీజేపీ అంటూ మండిపడ్డారు. అలాగే.. హరీశ్‌రావు, మహేశ్వర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, కాంగ్రెస్ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డికి అనవసం అని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఒక్క సీటు బీఆర్ ఎస్ గెలిచినా నేను దేనికైనా సిద్దమని వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు.
—————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
