Yashaswini Reddy Revanth Reddy
* పాలకుర్తి అభివృద్ధిపై చర్చ
* కాంగ్రెస్ బలోపేతంపై సమాలోచన
ఆకేరు న్యూస్, హైదరాబాద్: అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అమెరికా పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన ఝాన్సీ రాజేందర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధిపై నేతలు చర్చించారు.
పాలకుర్తి నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు నేతలు తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
