CP N. Swetha, Warangal Traffic Police
* రికార్డుల పరిశీలన
* ప్రమాదాలపై ఫోకస్
అకేరు న్యూస్, వరంగల్: వార్షిక తనిఖీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ శుక్రవారం వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్కు చేరుకున్న సీపీకి ఇన్స్పెక్టర్ మొక్క అందజేసి స్వాగతం పలకగా.. సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు.
* రికార్డుల పరిశీలన
తనిఖీలో భాగంగా సిబ్బంది కిట్ ఆర్టికల్స్, పోలీస్ స్టేషన్లోని వివిధ రికార్డులను సీపీ పరిశీలించారు. సిబ్బంది శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ విధుల నిర్వహణ, వాహనాల తనిఖీలు, నిబంధనల అమలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
* ప్రమాదాల నివారణకు చర్యలు
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాల నివారణతో పాటు వాహనదారులు, పాదచారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీపీ సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ అవసరమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
* ప్రజలకు అవగాహన కల్పించాలి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు.. ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్ పోలీసులు ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సమర్థవంతమైన సేవలు అందించాలని తెలిపారు.
* మెరుగైన సేవలు అందించాలి
స్టేషన్లో రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరు, విధుల కేటాయింపు తదితర అంశాలను సీపీ పరిశీలించారు. విధుల్లో మరింత అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు, ఏసీపీ సత్యనారాయణ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
