Medikonda U-Turn Protest
* రాస్తారోకోతో ట్రాఫిక్ జామ్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం మీదికొండ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన యూటర్న్‌ను మూసివేయొద్దంటూ గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. యూటర్న్ మూసివేసే ప్రయత్నాలను నిరసిస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. యూటర్న్ మూసివేస్తే గ్రామం నుంచి మండల కేంద్రంతో పాటు ఇతర గ్రామాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ప్రజల రాకపోకల అవసరాలను దృష్టిలో ఉంచుకుని యూటర్న్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. మూసివేసే ప్రయత్నాలు కొనసాగితే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు ఉంటాయని నచ్చజెప్పడంతో గ్రామస్తులు రాస్తారోకో విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. యూటర్న్ విషయంలో అధికారులు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని స్థానికులు కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
