Acham Naidu Performance
* మంత్రులకు ఆదర్శంగా పనితీరు
* టెక్నాలజీతో వేగవంతమైన పాలన
ఆకేరు న్యూస్, అమరావతి: ఏపీ సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఫైళ్ల క్లియరెన్స్‌లో ఎవరు వేగంగా పనిచేస్తున్నారు.. ఎవరి వద్ద జాప్యం జరుగుతోందనే అంశాలను వెల్లడించారు. తాను కూడా ఫైళ్ల పరిశీలనకు నాలుగు రోజుల సమయం తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు.
* వరుసగా మూడోసారి మొదటి స్థానం
ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. వరుసగా మూడోసారి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు.
* గంటల్లోనే ఫైళ్ల పరిష్కారం
అచ్చెన్నాయుడు ఏ ఫైలును అనవసరంగా పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిశీలిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. శాఖాపరమైన ఫైళ్లతో పాటు ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని అన్నారు.
* మంత్రులకు ఆదర్శం
పాలనలో నిర్ణయాలు ఎంత వేగంగా తీసుకుంటే ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అంత త్వరగా చేరుతాయని చంద్రబాబు అన్నారు. అచ్చెన్నాయుడు పనితీరు ఇతర మంత్రులు, శాఖలకు ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు.
* సాంకేతికతతో వేగవంతమైన పాలన
ఈ-ఫైలింగ్ విధానాన్ని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పరిపాలనలో జాప్యాన్ని తగ్గించవచ్చని అచ్చెన్నాయుడు నిరూపిస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, జవాబుదారీతనం ఉండేలా ఆయన తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు అభినందించారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
