* రజతోత్సవ సభ నేపథ్యంలో సన్నాహక సభ
ఆకేరు న్యూస్, కరీంనగర్ : బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR).. కరీంనగర్ పర్యటకు విచ్చేశారు. గులాబీ శ్రేణులు ఆయనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఏప్రిల్ 27న వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఆదివారం కరీంనగర్లో ఉమ్మడి జిల్లా రజతోత్సవ సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని బీఆర్ఎస్(BRS) నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి(PADI KOUSIKREDDY), మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, రాగిడి లక్ష్మారెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాది మంది ముఖ్య కార్యకర్తలు తరలి వచ్చారు. కరీంనగర్ బైపాస్ రోడ్డులోని వీ కన్వెన్షన్లో జరిగే సభకు ఐదు వేలకు పైగా ముఖ్యకార్యర్తలు వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.కరీంనగర్(KARIMNAGAR)లోని రాంనగర్ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమై, తెలంగాణచౌక్, కమాన్మీదుగా సభాప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
