* భూదాన్ భూముల కేసులో హైకోర్టు
* మళ్ళీ సింగిల్ బెంచ్‌కు వెళ్లాలని సూచన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భూదాన్ భూముల కేసులో ఐపీఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టులో (High Court) చుక్కుదురైంది. ఐపీఎస్‌ల పిటిషన్లపై హైకోర్టులో నేడు విచారణ ముగిసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి హైకోర్టు నిరాకరించింది. భూములను నిషేధిత జాబితాలో ఉంచాలని సింగిల్ బెంచ్ ఉత్తర్వులను జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై అదే బెంచ్‌లో వెకేట్ పిటిషన్ వేసుకోచ్చని పేర్కొంది. రవిగుప్తా, మహేష్ భగవత్, శిఖా గోయల్, సౌమ్య మిశ్రా, తరుణ్ జోషి, రాహుల్ హెగ్డే వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలంటూ ఐపీఎస్ అధికారులు (IPS Officers) హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం అప్పీల్‌కు ఎందుకు వచ్చారని ఐపీఎస్ అధికారులను ప్రశ్నించింది. అలాగే సింగ్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మళ్ళీ సింగిల్ బెంచ్‌కు వెళ్లాలని ఐపీఎస్‌లకు డివిజన్ బెంచ్ సూచించింది. ఈకేసుకు సంబంధించి సింగిల్ బెంచ్ తుది నిర్ణయం తీసుకోవాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఆపై ఐపీఎస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ముగించింది.
……………………………………………
