* గుర్తించిన ఎన్ఐఏ
ఆకేరున్యూస్: ఈనెల 22న జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. టూరిస్ట్లే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరంగా చేయగా.. కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా కమాండర్ ఫరూక్ అహ్మద్ కీలకపాత్ర పోషించినట్లు సమాచారం.. తన స్లీపర్ సెల్ నెట్వర్క్ ద్వారా గత రెండేళ్లుగా కశ్మీర్లో పలు ఉగ్రదాడులు నిర్వహించడంలో అహ్మద్ కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. వీటిలో తాజాగా జరిగిన పెహల్గామ్ దాడి ఒకటి. నిఘా వర్గాల ప్రకారం.. అహ్మద్ 1990 నుంచి 2016 వరకూ పాక్ – భారత్ మధ్య పలుమార్లు ప్రయాణించినట్లు గుర్తించారు.
………………………………….
