ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం దోస్త్ (Dost) షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో రూ. 200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈ నెల 10 నుంచి 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. మే 29న ఫస్ట్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు మే 30 నుంచి జూన్ 6వ తేదీలోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ (Self Reporting) చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ దరఖాస్తుల ప్రక్రియ మే 30 నుంచి జూన్ 8 వరకు కొనసాగనుంది. సెకండ్ ఫేజ్‌లో కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూన్ 13న రెండో దశ సీట్లు కేటాయించనున్నారు. జూన్ 13 నుంచి 18వ తేదీ లోపు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. థర్డ్ ఫేజ్ దరఖాస్తుల ప్రక్రియ జూన్ 13 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనుంది. రిజిస్ట్రేషన్‌కు రూ. 400 చెల్లించాలి. జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్ 23న సీట్ల కేటాయింపు జరగనుంది. జూన్ 23 నుంచి 28 వరకు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
