– వారం క్రితం ప్రసవానికి వచ్చిన మహిళకు కడుపులోనే కాటన్ బ్యాండేజ్ ఉంచి నిర్లక్ష్యంగా శస్త్ర చికిత్స
– వారం తర్వాత తీవ్ర నొప్పితో హాస్పిటల్ కి వెళ్లడంతో మహిళ బయటపడ్డ డాక్టర్ల బాగోతం
– హాస్పిటల్ ముందు బంధువుల ధర్నా
ఆకేరు న్యూస్, కమలాపూర్: కాపాడాల్సిన వైద్యుడే.. చికిత్స పట్ల అశ్రద్ధ వహించడం వల్ల నమ్మి వస్తున్న ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. వారం క్రితం శస్త్ర చికిత్స చేసి ప్రసవం చేసిన డాక్టర్లు కడుపులోనే కాటన్ బ్యాండేజ్ మరచిపోయి కుట్లు వేసారు. దీంతో సదరు మహిళకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్ గ్రామానికి చెందిన అన్రాసి తిరుమల ప్రసవానికి ఆసుపత్రి కి రాగా ప్రసవానంతరం నిర్లక్ష్యంగా డాక్టర్లు ఆమెకు కడుపులోనే కాటన్ బ్యాండేజ్ ఉంచి కుట్లు వేసారు. ఇంటికి వెళ్ళాక సదరు మహిళ కడుపునొప్పి తో ఇబ్బంది పడ్తుంది. ఆదివారం నొప్పి ఎక్కువ కావడంతో ఆమెను మరోసారి కమలాపూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.కాటన్ ప్యాడ్ తొలగించేందుకు డ్యూటీలో ఉన్న నర్స్ కి డాక్టర్ ఫోన్ లో వివరించటంతో, నర్స్ బ్యాండేజ్ తొలగించింది.ప్రస్తుతం బాలింత ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ …
సిజేరియన్ చేసిన డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే అనారోగ్య పరిస్థితి తలెత్తిందని, దాని కారణంగానే ఆమె తీవ్ర కడుపు నొప్పితో బాధపడిందని ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం రోజు రాత్రి హాస్పిటల్ ఎదుట ధర్నా చేశారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

………………………………………..
