* వడగండ్లు, పిడుగులు పడుతాయని ఐఎండీ హెచ్చరిక..
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో ఐదురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రాబోయే మూడురోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని.. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడుతాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ని జారీ చేయగా.. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని.. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. అలాగే రేపు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని.. భూపాలపల్లి, ములుగు, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పిడుగుల వాన కురిసే అవకాశం ఉందని చెప్పింది. బుధవారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట ఉరుములు, పిడుగులు, ఈదుగాలులతో వానలు పడుతాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. అలాగే, గురు, శుక్రవారాల్లోనూ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి తదితర జిల్లాల్లో వానలు కురుస్తాయని వివరించింది.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
