Sumathi Reddy Engineering College
ఆకేరు న్యూస్, వరంగల్ : బోగస్ అడ్మిషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధుల వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు (Sumathi Reddy Engineering College ) సుమతి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అడ్మిషన్ల వివరాలు, విద్యార్థుల హాజరు, కాలేజీ రికార్డులు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం నుంచి కూడా సంబంధిత వివరాలను సేకరిస్తున్నారు.
తనిఖీలు పూర్తయిన అనంతరం సేకరించిన వివరాల ఆధారంగా ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
