Gold and silver prices
* Gold and silver prices.. కొనుగోలుదారులకు షాక్
ఆకేరు న్యూస్, డెస్క్ : బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. (Gold and silver prices ) వరుసగా ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులపై అదనపు భారం పడుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,420 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,840కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాములకు రూ.1,300 పెరగడంతో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,850కి చేరింది.
మరోవైపు వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి. కిలో వెండిపై రూ.5,000 పెరగడంతో కిలో ధర రూ.2.60 లక్షలకు చేరింది. బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతుండటంతో ఆభరణాల కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారిపై ఈ ధరల పెరుగుదల ప్రభావం పడుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
