* మాజీ మంత్రి హరీశ్‌రావు
ఆకేరున్యూస్, సిద్దిపేట : పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏరి వేయడానికి భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశంసించారు. పహల్గాంలో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపడం కలిచివేసిందన్నారు. సిద్దిపేటలో దుర్గా ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ సంతోషిమాత దేవాలయంలో 108 హోమ కుండాలతో హనుమాన్ యజ్ఞం నిర్వహించారు. ఈ యజ్ఞంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని, భారతదేశంలో శాంతి నెలకొలపాలని దుర్గాప్రసాద్ స్వామీజీ ఆశీస్సులతో చేసే ఈ హోమం ఫలించాలని కోరుకుంటున్నానన్నారు. మన సైనికులకు బలాన్ని అందించి, ఉగ్రవాదులపై విజయం సాధించాలని మనసారా ఆకాంక్షిస్తున్నానన్నారు.
…………………………………….
