బోండా ఉమామహేశ్వర రావు
* మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు
* నామినేషన్ వేసినప్పటి నుంచి వేధింపులు పెరిగాయి
* వంద మంది మా ఆఫీసును చుట్టుముట్టారు
* విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమ
* ఏ క్షణమైనా అరెస్ట్?
ఆకేరు న్యూస్, విజయవాడ : జగన్ పై రాయి దాడి కేసులో పోలీసులు నన్ను వేధిస్తున్నారని విజయవాట సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బొండా ఉమ ఆరోపించారు. వంద మంది పోలీసులు మా ఆఫీసును చుట్టుముట్టారని తెలిపారు. మా పేర్లు చెప్పాలని వేముల దుర్గారావును చిత్రహింసలకు గురి చేస్తున్నారని, ఎక్కడ దాచారో వారం రోజులుగా తెలియడం లేదని ఆరోపణలు చేశారు. తనపై యుద్ధానికి పంపినట్లు ఇద్దరు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, కానిస్టేబుళ్లను తనపైకి పంపారని అన్నారు. డీజీపీ, సీపీ, ఏసీపీ అంతా సిండికేట్ గా ఏర్పడి తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్నారని తెలిపారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన బొండా ఉమ నామినేషన్ వేసిన నాటి నుంచి వేధింపులు పెరిగాయని చెప్పారు. కాగా, పోలీసులు భారీ సంఖ్యలో బొండా ఉమ నివాసాన్ని చుట్టుముట్టిన నేపథ్యంలో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో తెలుగుదేశం కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉమ నివాసానికి చేరుకుంటున్నారు.
——————————————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
