* వరంగల్ లో చికిత్స పొందుతూ మృతి
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : తెలుగు సినీరంగంలో విషాదం నెలకొంది. బలగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు జీవీ బాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలిసి బలగం మూవీ డైరెక్టర్ వేణు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. జీవీ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. “జీవీ బాబు గారు ఇకలేరు. ఆయన జీవితం మొత్తం నాటక రంగంలోకే గడిపారు. చివరి రోజుల్లో ఆయనను బలగం మూవీతో వెండితెరకు పరిచయం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ పోస్ట్ చేశారు. జీవీ బాబు మృతి పై సినీప్రముఖులు, బలగం మూవీ నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు.
………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
