* హాహాకారాలు.. కన్నీళ్లతో అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రి
* విమాన ప్రమాదంలో మృతుల బంధువుల డీఎన్ ఏ శాంపిళ్ల సేకరణ
* మాంసపు ముద్దలు, కాలిన మృతదేహాల గుర్తింపు
ఆకేరు న్యూస్, డెస్క్ : అహ్మదా బాద్ నుంచి లండన్ వెళ్తున్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, కుమార్తెలు, కుమారులను బై చెప్పేందుకు వచ్చి ఎయిర్ పోర్టులో వారితో సంతోషంగా గడిపారు. హృదయానికి హత్తుకుని హ్యాపీ జర్నీ అని ఆనందంగా సాగనంపారు. వారు ఎక్కిన విమానం గాల్లోకి ఎగిరిన సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలిన (Air India Flight Crash) విషయం తెలియగానే అందులోని ప్రయాణికుల కుటుంబ సభ్యులు కూడా కుప్పకూలిపోయారు. నిన్న తమ వారిని సాగనంపేందుకు విమానాశ్రయంలో సంతోషంగా గడిపి, వీడ్కోలు పలికిన వారు.. నేడు ఆస్పత్రిలో మృతదేహాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. తమ వారి కోసం ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు. నిమిషాల వ్యవధిలో ప్రమాదంలో ఏకంగా 245 మంది విగతజీవులుగా మారారు. వారి మృతదేహాలను అహ్మదాబాద్ లోని సివిల్ ఆస్పత్రి(Ahmadabad Civil Hospital) కి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో సివిల్ ఆస్పత్రి నిండిపోయింది. ఆస్పత్రి ప్రాంగణం హృదయ విదాకరకంగా మారింది. హాహాకారాలు..ఆ ర్తనాదాలు.. కన్నీళ్లుతో నిండిపోయింది. తమ వారి డెడ్ బాడీ కోసం కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతులను గుర్తిస్తున్నారు. అధికారులు ఇప్పటికే 205 మంది డీఎన్ ఏ శాంపిళ్లు సేకరించారు. గుర్తించిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
