* మూడు నెలలకు సరిపడా పంపిణీ చేశాం
* అదనపు కలెక్టర్ మహేందర్ జీ
ఆకేరు న్యూస్ ములుగు : ములుగు జిల్లాలో రేషన్ కార్డుదారులకు 3 నెలల సరిపోయే
సన్న బియ్యం పంపిణీ చేశామని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి శుక్రవారం ఒక ప్రకటన లో తెలిపారు. ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో
ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ సన్న బియ్యం పంపిణీ చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 222 రేషన్ షాపుల ద్వారా 19 రోజుల్లో 5,218 మెట్రిక్ టన్నులు సన్న బియ్యం ను లబ్ధిదారులకు పంపిణీ చేసి రాష్ట్రంలో ములుగు జిల్లా ముందంజలో ఉందని పేర్కొన్నారు.అన్ని శాఖల అధికారుల సమన్వయంతో రేషన్ కార్డు దారులకు ఇబ్బందుల కలుగకుండా సన్న బియ్యం లబ్దిదారులకు 100 శాతం పంపిణీ చేయడం జరిగినదని ఆయన వివరించారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
