* వాహనదారులు హెల్మెట్ ధరించాలి
* జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్
ఆకేరు న్యూస్ ములుగు ః రోడ్డు భద్రత నియమాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ శబరిష్ శనివారం అన్నారు. రోడ్డు భద్రతపై మీడియాతో ఎస్పీ మాట్లాడారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనదారుల హెల్మెట్ ధారణ పై జిల్లా లోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించిన్నట్లు తెలిపారు . ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన అధిక మరణాలు నమోదు అవుతున్నాయన్నారు., జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో హెల్మెట్ ధరించని 600 మందికి 87,200 జరిమానా విధించినట్లు ఎస్పీ వెల్లడించారు. ద్విచక్ర వాహన చోదకులు విధిగా, హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, రోడ్డు ప్రమాదాలలో విలువైన తమ ప్రాణాలు కోల్పోకూడదని వివరించారు .వాహన చోదకులు మరియు ప్రజలలో మార్పు కోసమే ఈ స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
